Shahid Afridi : ఇర్ఫాన్ పఠాన్‌పై షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు.
ఇండియా పాకిస్తాన్ యుద్దం ముగిసిన తర్వాత ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఇండియా పై గెలిచామంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.
పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత సైన్యాన్ని కించపర్చేలా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఇంకా దిగజారవద్దు అంటూ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటనలు చేశారు. పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్.. భారత్ లో చిన్న పటాకులు పేలిన భారత్ పాక్‌నే నిందిస్తాయని అన్నారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేశారు షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దారుణమైన ప్రదర్శన తర్వాత అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ తో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీలు మాలిక్, అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఓటమికి వసీమ్ ఇమాద్ కారణమన్నారు. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనారోగ్యంతో ఉన్న తన సోదరిని చూసేందుకు లెజెండరీ క్రికెటర్ వెళ్తుండగా.. ఆమె కన్నుమూసింది. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అఫ్రిది సోదరి మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్‌మీడియా వేదికగా ధ్రువీకరించారు. ఈ విషాద వార్తతో పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అఫ్రిదికి సంతాపం చెప్పారు.
టీమిండియా క్రికెటర్లు బలంగా మారడానికి మాంసం కారణమని పాక్ లెజెండ్ షాహీద్ అఫ్రిది చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. అఫ్రిది అభిప్రాయం సరైనది కాదని కొంతమంది చెబుతుండగా.. లేదు లేదు కరెక్ట్‌గానే చెప్పాడని మరికొందరు అంటున్నారు. అయితే శాఖాహారం అయినా మాంసాహారమైనా ఫిట్నెస్ కోసమేనని.. నాన్‌వెజ్ తినే క్రికెటర్లు కంటే వెజ్ తినే కోహ్లీ ఫిట్‌గా ఉంటాడని.. అఫ్రిది మాటలు తింగరిగా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.