Shahid Afridi : మళ్ళీ నోరు పారేసుకున్న అఫ్రిది.. ఇండియాను టార్గెట్ చేస్తూ.. అసలు ఏమన్నాడంటే?

షాహిద్ అఫ్రిదికి భారత్ మీద పడి ఏడవడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపి బంగ్లాదేశ్ తప్పుకుంది.

New Update
afridi

షాహిద్ అఫ్రిదికి భారత్ మీద పడి ఏడవడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపి బంగ్లాదేశ్ తప్పుకుంది. దీంతో ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ గ్యాప్‌లో దూరిన అఫ్రిది.. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అఫ్రిది ఏమన్నారంటే?

 "2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు రానన్న భారత్ భద్రతా కారణాలను ఐసీసీ అంగీకరించింది. కానీ ఇప్పుడు భారత్‌కు వెళ్లము అన్న బంగ్లాదేశ్ విషయంలో మాత్రం ఐసీసీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది? ఐసీసీ కేవలం భారత్ మాట మాత్రమే వింటోంది, చిన్న దేశాలను తొక్కేస్తోంది" అంటూ అఫ్రిది ఫైర్ అయ్యారు. క్రికెట్‌లో అందరికీ ఒకే నీతి ఉండాలని, ఐసీసీ వంతెనలు కట్టాల్సింది పోయి కూల్చేస్తోందని ఆయన విమర్శించారు.

భద్రతా ముప్పు ఏమీ లేదని తేలినా

ఐసీసీ క్లారిటీ: అయితే అఫ్రిది ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ బోర్డుతో తాము మూడు వారాల పాటు చర్చలు జరిపామని, భారత్‌లో వారికి ఎలాంటి ప్రాణహాని లేదని అన్ని రకాలుగా నిర్ధారించుకున్నామని ఐసీసీ స్పష్టం చేసింది. భద్రతా ముప్పు ఏమీ లేదని తేలినా బంగ్లాదేశ్ ఆడేందుకు నిరాకరించింది కాబట్టే వేరే దారి లేక స్కాట్లాండ్‌ను ఎంపిక చేశామని బోర్డు క్లారిటీ ఇచ్చింది. విశ్లేషకులు కూడా అఫ్రిది మాటలను కొట్టిపారేస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం అఫ్రిది అనవసరంగా భారత్‌ను ఈ గొడవలోకి లాగుతున్నారని వారు విమర్శిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు