Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా షారుఖ్..!
షారుఖ్ ఖాన్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత గ్రెవెన్ మ్యూజియం షారుఖ్ పేరుతో ప్రత్యేక గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆగష్టు 10 న ఈ బంగారు నాణేలను గ్రేవిన్ మ్యూజియం విడుదల చేయనుంది.