Rohit Sharma : విరాట్ బాటలోనే రోహిత్.. టీ20లకు రిటైర్మెంట్
భారత హిట్ మ్యాన్ టీ 20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ విజయానికి భారత సేనను నడిపించిన రోహిత్ ఇక తాను టీ 20 లను ఆడనని అనౌన్స్ చేశాడు.
భారత హిట్ మ్యాన్ టీ 20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ విజయానికి భారత సేనను నడిపించిన రోహిత్ ఇక తాను టీ 20 లను ఆడనని అనౌన్స్ చేశాడు.
టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్నీ మర్చిపోయి మనసారా అభినందించుకున్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాను ముద్దుపెట్టుకున్న సన్ అందరి మనసులనూ దోచుకుంది.
విశ్వవిజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కప్‌ను అందకోవడానికి చిన్నపిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. రోబోలా, డైనోసార్లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేతి నుంచి కప్పును అందుకున్నాడు.
కోట్లాది భారతీయుల కల నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు రోహిత్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమ్ ఇండియా విక్టరీ కొట్టింది.
టీ20 WC ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.
సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓపెనర్‌గా అట్టర్‌ఫ్లాప్ అవుతున్న కోహ్లీని వన్-డౌన్లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం సౌతాఫ్రికాతో ఫైనల్ పోరుకు సిద్ధమవుతుంది.సెమీఫైనల్ లో ఇంగ్లండ్ ను ఓడించి 2022 టీ20 ఓటమికి రివేంజ్ తీసుకుంది.నిన్న టీమిండియా గెలిచిన రోహిత్ శర్మ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు.దీనికి కారణం శివమ్ దూబేనే!
ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ లో ఓపెనర్ గా అదరగొట్టిన విరాట్ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్నాడు. మరో ఎండ్ లో ఐపీఎల్ లో నిరాశపరిచిన రోహిత్ ఒంటిచేత్తో భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. వీరి ఆటతీరుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు (200) కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. టీ 20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత దక్కించుకున్నాడు.