IND vs SA : ఫైనల్‌లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్‌ మదిలో ఏముంది?

సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఓపెనర్‌గా అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్న కోహ్లీని వన్‌-డౌన్‌లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్‌ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట.

New Update
IND vs SA : ఫైనల్‌లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్‌ మదిలో ఏముంది?

T20 WC Final : ఈ టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫ్లాప్‌ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ సరిగ్గా ఆడలేదు. పైగా ఓపెనరగా బరిలోకి దిగుతున్నాడు. నిజానికి కోహ్లీ వన్‌-డౌన్‌లో మంచి బేటర్. అయితే ఐపీఎల్‌ (IPL) లో ఓపెనర్‌గా పరుగుల వరద పారించిన కోహ్లీని మ్యానేజ్‌మెంట్‌ టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup) లో ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. ఈ నిర్ణయం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఎందుకంటే అసలు కోహ్లీ పరుగులు చేయడానికి నానాతంటాలు పడుతున్నాడు. మరో ఓపెనర్‌, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతుంటే కోహ్లీ మాత్రం వికెట్‌ పారేసుకుంటున్నాడు. వెస్టీండిస్‌, అమెరికా పిచ్‌లపై కోహ్లీ ఆట అంతంతమాత్రమేనని అర్థమవుతోంది. ఇక ఇవాళ(జున్ 29) సౌతాఫ్రికాపై పైనల మ్యాచ్‌ ఉండడంతో అసలు టీమ్‌లో కోహ్లీని ఆడించడం అవసరమానన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా చేయవచ్చు కదా?
యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ను పక్కన పెట్టి మరీ కోహ్లీతో టీమిండియా ఓపెనింగ్‌ చేయిస్తోంది. మరోవైపు మిడిలార్డర్‌లో దూబే ఘోరంగా విఫలమవుతున్నాడు. బాల్‌ టచ్‌ చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు దూబే 21.2 యావరేజ్‌, 106 స్ట్రైక్ రేట్‌తో కేవలం 106 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో దూబేని పక్కన పెట్టి కోహ్లీని వన్‌-డౌన్‌లో ఆడించి యశస్వీ జైస్వాల్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.


35 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో 10.71 సగటుతో మాత్రమే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్‌ కూడా 100 మాత్రమే ఉంది. ఇది టీ20లకు ఏ మాత్రం సరిపోని స్ట్రైక్‌ రేట్‌. సెమీస్‌ వరకు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ. అటు కోహ్లీ కారణంగా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. నిజానికి కోహ్లీ భారత్‌ తరుఫున వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం ఓపెనర్‌గా అతడిని ప్రమోట్ చేయడం తప్పు అని ఇప్పటికే అర్థమైంది.

Also Read: టీ20 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయితే విజేతను తేల్చేదెలా?

Advertisment
తాజా కథనాలు