Fans Says Sorry To Pandya : ఎన్నెన్ని మాటలు అన్నారు.. ఎంత బాధను భరించాడు.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను ఇష్టపడే వారి కంటే ద్వేషించే వారే ఎక్కువ. ఎందుకంటే రోహిత్‌పై ఉన్న ప్రేమ పాండ్యాపై ద్వేషంగా మారేలా చేసింది ఐపీఎల్. రిచెస్ట్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ 2023 డిసెంబర్ నుంచి మొన్న మే లో ముగిసిన ఐపీఎల్-2024 (IPL – 2024) వరకు రోహిత్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ జెండాలను కూడా తగలబెట్టారు. పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. ఇదంతా స్టేడియంలోనూ కనిపించింది. ముంబై ఇండియన్స్‌కు పాండ్యా కెప్టెన్సీ చేస్తున్న సమయంలో, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ ఫ్యాన్స్ ‘బూ’ సౌండ్స్ చేశారు. అయితే సరిగ్గా నెల రోజుల్లో సీన్ మొత్తం మారిపోయింది. పాండ్యాను తిట్టిన ఆ నోర్లే ఇప్పుడు అతడిని మెచ్చుకుంటున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో పాండ్యాది కీలక పాత్ర. ఫైనల్లోనూ ఫైనల్ ఓవర్ వేసిన పాండ్యా టీమిండియాను గెలిపించి అందరి చేత జేజేలు అందుకున్నాడు.
పూర్తిగా చదవండి..Hardik Pandya : విలన్ టు హీరో.. తిట్టిన నోర్లే మెచ్చుకుంటున్నాయి.. పాండ్యాకు ఫ్యాన్స్ ‘సారీ’ !
తిట్టిన నోర్లు మూతపడ్డాయి. హార్దిక్‌పాండ్యాను గేలీ చేసిన ఆ మనుషుల మనసులు మారాయి. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్యా టీమిండియా ట్రోఫీ గెలవడంతో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో పాండ్యాను గతంలో తిట్టినవాళ్లు ఇప్పుడు సారీ చెబుతున్నారు.
Translate this News: