T20 World Cup : వైరాన్ని పోగొట్టి.. ప్రేమను మిగిల్చిన గెలుపు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్నీ మర్చిపోయి మనసారా అభినందించుకున్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాను ముద్దుపెట్టుకున్న సన్ అందరి మనసులనూ దోచుకుంది. By Manogna alamuru 30 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rohit - Hardik Video Viral : రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా (Hardik Pandya)... గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్యా వైరం నడుస్తోంది. బయటకు కనిపించకపోయినా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ మాత్రం ఉంది. ఐపీఎల్ (IPL) వేలం దగ్గర నుంచీ ఇది మొదలయ్యింది. అంతకు ముందు ఇద్దరూ కలిసి చాలా మ్యాచ్‌లు ఆడారు. ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. అయితే ఈ సీజన్ ఐపీఎల్ మాత్రం రోహిత్, పాండ్యాల మధ్య చిచ్చు పెట్టింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్ టీమ్ యాజమన్యమే అంతా చేసింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుచి తప్పించి హార్దిక్‌ను పట్టింది. బోలెడంత డబ్బులు పోసి గుజరాత్ నుంచి హార్దిక్‌ను కొనుక్కుని తీసుకువచ్చింది. ఇది రోహిత్‌నే కాదు ముంబై ఫ్యాన్స్‌కు కూడా కోపం తెప్పించింది. అసలే వన్డే వరల్డ్‌కప్ పోయి బాధలో ఉన్న రోహిత్‌ను ఇది మరింత కుంగదీసింది. అయితే దీని గురించి అతను మాత్రం ఎక్కడా ఏ కామెంట్ చేయలేదు. కానీ పాండ్యా మీద వచ్చిన ట్రోల్స్‌ను కూడా ఖండించలేదు. దాంతో పాటూ హార్దిక్ కెప్టెన్సీలో ముంబ ఇండియన్స్ దారుణంగా ఓడిపోయింది. అది అవ్వగానే టీ 20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఆడ్డానికి వచ్చారు భారత జట్టు. మొత్తం టోర్నీలో ఎక్కడా ఇద్దరూ తమ మధ్య ఉన్న గ్యాప్‌ను చూపించలేదు. కానీ చివరి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన కోపాన్నంతా మర్చిపోయాడు. ఇండియా విశ్వవిజేతగా నిలవడానికి కారణం అయిన హార్దిక్‌ను మనసారా హత్తుకుని కౌగలించుకున్నాడు. భావోద్వేగంతో ముద్దుకూడా పెట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) Also Read : విరాట్ బాటలోనే రోహిత్.. టీ20లకు రిటైర్మెంట్ #hardhik-pandya #rohit-sharma #india #cricket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి