ICC : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు భారతీయులు!
ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Rohit: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 3 వస్థానంలో రోహిత్ శర్మ!
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మ 3వ స్థానానికి ఎగబాకాడు.రోహిత్ శర్మ 763 పాయింట్లతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేశాడు.
రోహిత్ ను కెప్టెన్సీ చేశాను..కానీ నన్ను అందరూ మర్చిపోయారు..గంగూలీ!
రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగించినప్పుడు చాలామంది విమర్శించారని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.అయితే ఇప్పుడు రోహిత్ భారత్‌ను టీ20 వరల్డ్ కప్ సాధించటంతో విమర్శలు చేయటం మానేశారు. అతడిని కెప్టెన్‌గా నియమించింది నేనే అన్న విషయం అందరూ మర్చిపోయారని గంగూలీ వాపోయారు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బుమ్రాకే!
జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బుమ్రాకి దక్కింది. టీ20 వరల్డ్ కప్ గెలవటంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన బుమ్రాకు ఐసీసీ ప్రధానం చేసింది.ఈ అవార్డ్ రేసులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘాన్ ప్లేయర్ రహ్మదుల్లా గుర్బాజ్ ఉన్నారు.
అరుదైన రికార్డ్ సాధించబోతున్న రోహిత్ శర్మ!
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశ కెప్టెన్ పొందని ఘనత రోహిత్ శర్మ అందుకోబోతున్నాడు.T20,ODI,టెస్ట్‌లలో ICC ప్రపంచ కప్‌ను గెలుచుకుని అదే సిరీస్ ముగింపులో ఏ ఆటగాడు రిటైర్ కాలేదు. ఆ అరుదైన ఘట్టాన్ని చూపించే అవకాశం రోహిత్ శర్మకు రాబోతుంది.
IND vs SL: శ్రీలంక టూర్‌కు రోహిత్, కోహ్లీ, బుమ్రా మిస్..! కారణం ఏంటో తెలుసా?
టీమిండియా లో చేరడానికి తమకు మరింత సమయం కావాలని ముగ్గురు క్రికెటర్లు కోరుతున్నారు. దీంతో వీరు శ్రీలంక టూర్ కు అందుబాటులో ఉండకపోవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా సెప్టెంబర్ 19 నుంచి బాంగ్లాదేశ్ టూర్ కు అందుబాటులో ఉంటారని సమాచారం
MS Dhoni : హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి!
భారత మాజీ క్రికెటర్ ధోనీ నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి భారత జట్టు వెన్నెముకగా మారాడు. తొలి టీ 20 ప్రపంచకప్, రెండో వన్డే ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు.
Team India: స్వదేశానికి చేరుకున్న విశ్వ విజేతలు!
కరేబియన్ గడ్డ మీద జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ తన జట్టుతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారత బృందం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో బయల్దేరి గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది.