/rtv/media/media_files/2025/02/05/vq34C6CzoDpVC8ItoEjG.jpg)
rohit and kohli
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ .. త్వరలో పాకిస్తాన్, దుబాయ్‌లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెబుతాడని వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళికలను స్పష్టం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత కెప్టెన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. 2027 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ కూడా భవిష్యత్తు కెప్టెన్ పై ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : Lady Professor : క్లాస్ రూమ్లో స్టూడెంట్తో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం!
విరాట్ కోహ్లీ కూడా
రోహిత్ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ ట్రోఫీలో కూడా రోహిత్ విఫలమయ్యాడు. రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు విరాట్ కోహ్లీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగన రంజీ మ్యాచ్ లో కూడా కోహ్లీ కేవలం 9 పరగులు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి టోర్నమెంట్ కావచ్చు. వారి రిటైర్మెంట్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Also read : భగ్గుమంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఇప్పుడు ఎంతంటే ?
ఇక టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించే అవకాశం ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ అభిమానులు కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల్లో మరోసారి ట్రోఫీని చూడాలనుకుంటున్నారు. రోహిత్ వయస్సు 40 సంవత్సరాలు, విరాట్ కోహ్లీ వయస్సు 39 సంవత్సరాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ఇద్దరి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read : భగ్గుమంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఇప్పుడు ఎంతంటే ?
Also Read : Aga Khan : ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూత