టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టీమిండియాకు కొత్త కెప్టెన్ను వెతకాలని బీసీసీఐకి రోహిత్ శర్మ సూచించినట్లుగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీతో సహా మరి కొన్ని నెలల పాటు తననే కెప్టెన్ గా కొనసాగించాలని హిట్ మాన్ బోర్డును కోరినట్టు సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపై శనివారం బోర్డు సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొని తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. Also Read : Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్! బుమ్రాకు కెప్టెన్సీ ఇచ్చేందుకు కొందరు ఇంట్రెస్ట్ చూపించలేదని తెలిసింది. దీంతో ఇంగ్లండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ కెప్టెన్ గా స్పష్టమైంది. రోహిత్ తర్వాత భారత్‌ను ఎవరు నడిపిస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్డి్ంగ్ మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమిని చవిచూసింది. -1-3తో సిరీస్ ను కోల్పోయింది. ఆ తర్వాత టీమ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను ట్రోలర్లు టార్గెట్ చేశారు. రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అవసరమైతే రిటైర్ కావలన్న డిమాండ్లు ప్రధానంగా వినిపించాయి. Also Read : జకోవిచ్‌పై విష ప్రయోగం.. ఆస్ట్రేలియా హోటల్ ఫుడ్‌లో! కొత్త కెప్టెన్ ఎవరు? జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు జట్టు కెప్టెన్సీ ఇవ్వవచ్చంటూ ప్రచారం నడుస్తోంది. అయితే ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను ప్రతి మ్యాచ్‌ను ఆడగలడా అనేది కూడా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని చివరి మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడడం అతనికి కష్టంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ 1-3 తేడాతో ఓడిపోయింది. బుమ్రా సారథ్యంలో పెర్త్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో మాత్రమే భారత్ విజయం సాధించింది. Also Read : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్! Also Read : పంత్ అలా చేస్తే నా పేరు మార్చుకుంటా.. అశ్విన్ సవాల్!