/rtv/media/media_files/2025/02/06/TmFrZDjPa2KNM4olp1io.jpg)
IND vs ENG
ఇంగ్లండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమైంది. గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టీమ్ ఈ సిరీస్ లోనైనా గెలిచి ప్రతికారం తీర్చుకోవాలని చూస్తోంది. జో రూట్ తిరిగి వన్డేలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ తరువాత జో రూట్ ఈ ఫార్మట్ కు దూరమయ్యాడు. ఎక్కువగా టెస్టుల పైనే ఫోకస్ చేశాడు. పేసర్ మార్క్ వుడ్‌కు విశ్రాంతి ఇచ్చారు. అటు ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.
వరుణ్ చక్రవర్తి డెబ్యూ
ఇక ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌ను పొందాలని టీమిండియా ఆశిస్తోంది. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ లో ఇద్దరు విఫలం కావడంతో వీరిపైనే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ తో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేసే అవకాశం ఉంది.
ఆల్ రౌండర్స్ హార్దిక్, జడేజాలకు పోటీ తక్కువే. బౌలింగ్ లో పేసర్ షమీ, రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫామ్ ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. ఈ ఇద్దరు ఇంజ్యురీస్ నుంచి కోలుకుని వచ్చారు.అర్హీప్ ప్లేస్ ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్లలో సుందర్, అక్షర్ పటేల్ లో ఒకరికే చాన్స్ దక్కవచ్చు.
భారత్ టీమ్ (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభ్‌మన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్/రిషబ్ పంత్ (వికెట్ కిపర్ ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
ఇంగ్లండ్ టీమ్ (అంచనా ) : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కిపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.