BCCI: రోహిత్‌ వారసుడెవరు.. ఈ ముగ్గురు కాకుండా మరోకరిపై బోర్డు కన్ను!

రోహిత్‌ వారసుడు ఎవరనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా, పంత్, జైస్వాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ వీరి వివిధ వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ముగ్గురిని కాకుండా మరొకరిని కెప్టెన్‌గా ఎంచుకోవాలని బీసీసీఐ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట.  

New Update
bcci rohit sharma

BCCI Big Plan for Team India Captain

BCCI: రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌ ఎవరు? రోహిత్‌ వారసుడు ఎవరనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు నెక్స్ట్ టెస్టు కెప్టెన్ బుమ్రా పేరు వినిపించగా... ఇప్పుడు మాత్రం మరో యువ క్రికెటర్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్​-గావస్కర్ ట్రోఫీలోనే... రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ గురించి చర్చ జరిగింది. ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేశాడు. ఆసమయంలో టెస్టుల నుంచి కూడా హిట్ మ్యాన్​ తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నాడు.కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వరకు రోహిత్‌ టెస్టు జట్టులో కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. మరి రోహిత్‌ వారసుడు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

బుమ్రా పేరే ముందుగా తెరమీదకు..

ప్రస్తుతం జట్టు వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పేరే ముందుగా తెరమీదకు వచ్చింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్‌ అందుబాటులో లేకుంటే అతనే జట్టును నడిపించి.. ఘనవిజయాన్ని అందించాడు. అయితే బుమ్రా ఫిట్‌నెస్‌ మీద సందేహాలు నెలకొనడం, టెస్టు కెరీర్‌ను ఎంతమేర పొడిగించుకోగలడనే ప్రశ్నలు తలెత్తుతుండడంతో... అతణ్ని కెప్టెన్‌ను చేసే విషయంలో సెలక్టర్లు, కోచ్‌ ముందడుగు వేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. నిలకడగా రాణిస్తూ టెస్టు జట్టులో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తున్న జైస్వాల్‌ను సారథిగా నియమిస్తే బాగుంటుందని కోచ్‌ గంభీర్‌ భావిస్తున్నాడట. జైస్వాల్‌ శ్రద్ధగా ఆట మీద దృష్టిపెట్టే తీరు, తన నిలకడను చూసి సారథిగా నియమించాలని గంభీర్‌ కోరుతున్నాడట. 

ఇది కూడా చదవండి: Google: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!

అయితే చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం అనుభవజ్ఞుడైన పంత్‌ వైపు చూస్తున్నట్లు సమాచారం. మరీ దూకుడుగా, కొన్నిసార్లు బాధ్యతారాహిత్యంగా ఆడతాడని విమర్శలు ఎదుర్కొనే పంత్‌ను... కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన ఆలోచనేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో కెరీర్‌ తొలి దశలోనే ఉండి... మరీ కుర్రాడైన యశస్విని సారథిగా ఎంపిక చేయడం మీద కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. చూడాలి మరి బీసీసీఐ పంత్, జైస్వాల్ లలో ఎవరికి టెస్టు పగ్గాలు అప్పగింస్తుందో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు