Rohit Sharma: ఛీ.. ఛీ..  మారని రోహిత్ శర్మ.. రంజీలో కూడా అట్టర్ ప్లాప్‌

జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఓపెనర్ గా ముంబై తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ హిట్ మ్యాన్..  కేవలం 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ చేతిలో వెనుదిరిగాడు.

New Update
rohit sharma Ranji Trophy

rohit sharma Ranji Trophy Photograph: (rohit sharma Ranji Trophy)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gawaskar Trophy) లో కెప్టెన్ గా, ఆటగాడిగా ఘోరంగా ప్లాప్ అయిన రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా రంజీ ట్రోఫీలో కూడా తన ఆటతీరును మార్చుకోలేదు. జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్ లో అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఓపెనర్ గా ముంబై తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ హిట్ మ్యాన్..  కేవలం 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ చేతిలో వెనుదిరిగాడు.

Also Read :   అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

Rohit Sharma - Ranji Trophy

తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడుతున్న రోహిత్ పేలవమైన ఫామ్‌ను కొనసాగించడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తోంది.  దీంతో రోహిత్ రిటైర్ కావాల్సిందేనంటూ కామెంట్స్ మళ్లీ వినిపిస్తున్నాయి. ఇక ఇదే మ్యా్చ్ లో రోహిత్ కంటే ముందు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 (8) కూడా త్వరగానే ఔటయ్యాడు.   దీంతో 5.5 ఓవర్ల తర్వాత ముంబై జట్టుల కేవలం 12 పరుగులు చేసి కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ అజింక్యా రహానే క్రీజులో హార్దిక్ తమోర్‌తో కలిసి ఆడుతున్నాడు.  

Also Read :  దూకుడు పెంచిన ట్రంప్‌..మెక్సికో కు 1500 మంది సైనికులు!

ముందుగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగి ముంబైకి ఇన్నింగ్స్‌ ను ప్రారంభించారు.   అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్న ఉమర్ నజీర్ ముందు రోహిత్ పూర్తిగా నిస్సహాయంగా కనిపించాడు.  అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.  దీంతో   19 బంతుల్లోనే వెనుదిరిగాడు.  

Also Read :  డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్..  మూడు నెలల జైలు శిక్ష

ముంబయి జట్టు ఇదే: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, అజింక్య రహానె (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్‌ తామోరె (వికెట్ కీపర్), శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్, షంసి ములాని, తనుష్ కొటియన్, మోహిత్ అవస్తి, కర్ష్‌ కొతారి

Also Read :  ఒరేయ్ నువ్వు మనిషివేనా.. భార్యను చంపేందుకు కుక్కతో ప్రాక్టీస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు