Champions Trophy : పాకిస్థాన్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..  ఎందుకంటే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లనున్నాడా? ప్రస్తుతం ఇదే క్రీడా వర్గాల్లో హాట్​టాపిక్ . అసలు రోహిత్ ఎందుకు పాకిస్థాన్ వెళ్లాలోఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం చదవండి.

New Update
rohit sharma pak

rohit sharma pak Photograph: (rohit sharma pak)

ఫిబ్రవరి 20 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.   1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఆ దేశానికి వెళ్లడం లేదు. టీమిండియా తనకు సంబంధించిన మ్యాచ్ లన్నీ  దుబాయ్‌లోనే ఆడుతుంది. అయితే.. ఈ మెగా ఈవెంట్‌కు ముందు కెప్టెన్  రోహిత్ శర్మ మాత్రం పాకిస్తాన్ కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.  హైబ్రిడ్ మోడ్‌లో భాగంగా టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్, యుఎఇలో జరుగుతాయి. 

ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌కు ముందు, ట్రోఫీతో పాల్గొనే జట్ల కెప్టెన్లందరి ఫోటోషూట్‌తో కూడిన కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. టోర్నమెంట్‌ను అధికారికంగా నిర్వహించే దేశంలో ఇటువంటి కార్యక్రమం ఎల్లప్పుడూ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ అధికారిక హోస్ట్‌గా ఉన్నందున..  మొత్తం 8 మంది కెప్టెన్‌లతో కూడిన అధికారిక కెప్టెన్ల ఫోటోషూట్ టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు అక్కడే నిర్వహించబడవచ్చు. భద్రతా కారణాల వల్ల భారత్ పాక్ లో పర్యటించడమే లేదు. అయితే కెప్టెన్ రోహిత్ ఈ ఫొటోషూట్​ కోసం పాక్​కు వెళ్తాడా? లేదా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు

టీమిండియా అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ ఈ ఈవెంట్‌కు హాజరు కావడానికి రోహిత్ శర్మ పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు క్రీడా నిపుణులు.  అయితే ఫోటోషూట్ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పుడూ పాకిస్థాన్‌కు వెళ్లలేదు.  ఇక  చాంపియన్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది.  ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 20న దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తన మొదటి మ్యాచ్ ను ఎదురుకుంటుంది. ఆ తరువాత ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్థాన్- తో తలబడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించలేదు.  

Also Read :  Padi kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ లో బిగ్ ట్విస్ట్!

Advertisment
తాజా కథనాలు