Road Accident : హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన ఆటో
హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కిందికి ఆటో చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.