/rtv/media/media_files/2025/01/20/IoVVXNEMVV0v7wqbz7Ug.jpg)
Tirupati road accident Photograph: (Tirupati road accident)
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లె వద్ద నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు స్పాట్ లోనే చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ, ఆయన భార్య ఐశ్వర్య, కుమారులు జీవన్, విశ్వ, అత్త కలైవాణి, బావమరిది సతీష్ లు తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా కారు, లారీ ఢీకొన్నాయి.
Also Read : ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!
ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న పిల్లలు జీవన్(10), విశ్వ(8) అక్కడిక్కడే మృతి చెందారు. ఇక తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కలైవాణి(45) కన్నుమూసింది. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్తికేయ పరిస్థితి విషమంగా ఉండగా, ఐశ్వర్య, సతీష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
మరోవైపు చంద్రగిరిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కల్యాణి డ్యామ్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మదనపల్లె బస్సు డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. వెంటనే గాయపడిన వారిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Follow Us