/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
Road Accident rangareddy Photograph
Road Accident: పండగ పూట రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తూరు సమీపంలో వేగంగా వస్తున్న కారు ట్రావెల్స్ బస్సులు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే షాద్ నగర్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో పంటి నొప్పి ఎందుకు పెరుగుతుంది?