ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 17  మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఆదివారం యాక్సిటెంట్ జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

author-image
By K Mohan
New Update
Ukhan

Ukhan Photograph: (Ukhan)

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. 17  మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. శ్రీనగర్ ప్రాంతంలోని దహల్చోరి దగ్గర కొండ దిగువన 100 మీటర్ల దూరంలో బస్సు బోల్తాపడింది.

ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అందులో ఐదుగురు మరణించారు. 17 మంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌరి జిల్లా కంట్రోల్ రూం SDRFకి స్థానికులు సమాచారం అందించగా.. SDRF టీం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు పౌరి నుంచి దహచోరికి వెళ్తుండగా ఇది జరిగిందని SDRF పోలీసులు తెలిపారు.

Also Read: సీఎం అతిషికి 4 గంటల్లోనే రూ.10 లక్షలు విరాళం

ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ.. పౌరీలోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే మార్గంలో జరిగిన యాక్సిడెంట్‌లో నలుగురు ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆ భగవంతుడు ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు. శ్రీనగర్ ఆసుపత్రికి ఏడుగురిని తరలించారు.

Advertisment
తాజా కథనాలు