/rtv/media/media_files/2025/01/22/kB9DxUJ8gN4lMbXW5MZc.jpg)
Karnataka accident Photograph: (Karnataka accident)
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈరోజు (జనవరి 22) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూరగాయలతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ట్రిప్పర్‌ని ఢీకొనడంతో పదిమంది మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ట్రక్కులో 30 మందికి పైగా ఉన్నారు. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
బుధవారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న కూరగాయల ట్రక్కు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. బాధితులు సావనూర్ నుంచి కుంత మార్కెట్‌కు కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సవనూరు-హుబ్బళ్లి రహదారిపై ప్రయాణిస్తుండగా అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు.
Also Read : ఏపీలో ఘోరం.. 10వ తరగతి అమ్మాయిని గర్భవతిని చేసిన ల్యాబ్ టెక్నీషియన్
మృతుల వివరాలు
ఫయాజ్ జమఖండి - 45 సంవత్సరాలు
వసీం ముదగేరి - 35 సంవత్సరాలు
ఇజాజ్ ముల్లా - 20 సంవత్సరాలు
సాదిక్ భాష్ - 30 సంవత్సరాలు
గులాం హుస్సేన్ టెక్స్‌టైల్ - 40 సంవత్సరాలు
ఇంతియాజ్ ముల్కేరి - 36 సంవత్సరాలు
అల్పాజ్ జాఫర్ మందక్కి - 25 సంవత్సరాలు
జీలానీ అబ్దుల్ జఖాతి - 25 సంవత్సరాలు
అస్లాం బాబులీ బెన్నీ - 24 సంవత్సరాలు
Also Read : బస్సు కోసం వెయిట్ చేస్తుంటే రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
రాయచూర్‌లో వాహనం బోల్తా
మరోవైపు కర్ణాటక (Karnataka) లోని రాయచూర్‌లో వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన సింధనూరులో చోటుచేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధనూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.గత నెల, బెంగళూరు సమీపంలో రోడ్డుకు అవతలి వైపున కంటైనర్ ట్రక్ పల్టీలు కొట్టి కారు నుజ్జునుజ్జు కావడంతో ఆరుగురు మరణించారు.
Also Read : AP Crime: కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Also Read : ఇంటి ముందు ముగ్గేస్తుండగా యువతిపై యాసిడ్ దాడి.. కారణం తెలిస్తే కంగుతింటారు!