BIG BREAKING: ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురి దుర్మరణం!

పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
accident (1)1

pune truck incident

Pune truck incident :  పూణేలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వాఘోలీ చౌక్ ప్రాంతంలోని కేస్‌నంద్ ఫాటా సమీపంలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన డంపర్ ట్రక్కు ఫుట్ పాత్ పైకి  దూసుకొచ్చి.. అక్కడ పెంకుటిల్లులో నిద్రిస్తున్న కార్మికులపైకి వెళ్ళింది. ఈ ఘటన తెల్లవారుజామున 1 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పసిపిల్లలతో సహా మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు.  తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురుని  సాసూన్ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: Hansika:హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!

మద్యం మత్తులో..?

ప్రాథమిక సమాచారం ప్రకారం, డంపర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. పూణే నుంచి వాఘోలీకి వెళుతుండగా ట్రక్కు పై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.  మృతులను వైభవ్ పవార్ (2), వైభవి పవార్ (1),  విశాల్ పవార్ (22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  స్థానికుల వివరాల ప్రకారం ఆ ప్రాంతాల్లోని వివిధ నిర్మాణ స్థలాల్లో కూలీలుగా  పనిచేసేందుకు ఆదివారం 12 మంది కార్మికులు అమరావతి నుంచి  ఇక్కడికి వచ్చిన ట్లు  తెలిపారు. పూణే పోలీసులు,  అధికారులు విపత్తుకు ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ!

Advertisment
తాజా కథనాలు