Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
తమిళనాడులోని తిళ్లవూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు రామ్, చేతన్, నితీశ్, యుకేశ్, నితీశ్ వర్మగా గుర్తించారు.