Road Accident: అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి!

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం గుంటూరు వెళ్తున్న మహిళల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

guntur road accident

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నారా కోడూరు- బుడంపాడు గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుద్ధపల్లి నుంచి కూలి పనుల కోసం కొంతమంది మహిళలు గుంటూరు బయలుదేరారు. అలా వెళ్తున్న క్రమంలో ఆ కూలీల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

పలువురుకి తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మరికొందరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

మంత్రి దిగ్బ్రాంతి 

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళలు మృతి బాధాకరం అని అన్నారు. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. 
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు