Road Accident: గుండె పగిలే ఘోర ప్రమాదం.. ఎదురుగా వచ్చిన మృత్యువు: తండ్రి, 5 నెలల ఏకైక పసికందు..!

హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. సాయి కుమార్ తన అమ్మనాన్న, భార్య, 5నెలల కుమారుడితో సూర్యాపేటకు బయల్దేరాడు. దండుమల్కాపురం వద్ద ఎదురుగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని వారికారుపై పడింది. ఈ ప్రమాదంలో సాయికుమార్, 5నెలల పసికందు మృతి చెందారు.

New Update
road accident on hyderabad vijayawada highway father and 5 months son died

road accident on hyderabad vijayawada highway father and 5 months son died

రోడ్డు ప్రమాదాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తరచూ ఇలాంటి ప్రమాదాల బారిన పడి ఎన్నో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

సాయి కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన తల్లి, తండ్రి, భార్య, 5 నెలల కుమారుడితో హైదరాబాద్‌ నుంచి సొంత పట్టణం అయిన సూర్యాపేటకు బయల్దేరారు. కొంత వరకు వారి ప్రయాణం సాఫీగా సాగిపోయింది. కానీ ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి కుమార్, 5 నెలల కుమారుడు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

ముంచుకొచ్చిన మృత్యువు

సుంకి సాయి కుమార్ (33) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడు తన ఫ్యామిలీతో కలిసి పటాన్ చెరు నుంచి సొంత పట్టణం అయిన సూర్యాపేటకి బయల్దేరాడు. అలా కారులో వెళ్తున్న క్రమంలో హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం చెరువు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఒక కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. అనంతరం సాయి కుమార్ ప్రయాణిస్తున్న కారుపై పడింది. 

Also Read:City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

దీంతో ఈ ప్రమాదంలో సాయి కుమార్, అతడి తల్లిదండ్రులు విజయ, వెంకన్న, భార్య సింధుజ, 5 నెలల ఏకైక కుమారుడు విరాన్స్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులోని వ్యక్తులను బయటకు తీశారు. అందులో సాయి కుమార్, అతడి కుమారుడు విరాన్ష్‌లకు సీపీఆర్ చేశారు. అయినా వారి ప్రాణాలు దక్కలేదు. అనంతరం తీవ్రంగా గాయపడిని మిగతా వారిని హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. 

Advertisment
తాజా కథనాలు