Road accident : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి

బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్‌ భానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా మృతుడు ఎమ్మెల్యే కాలె యాదయ్‌ గన్‌మెన్‌ ముత్తంగి శ్రీనివాస్‌గా గుర్తించారు.

New Update
Road Accident

Road Accident

Road accident : బంధువుల ఇంటికి వెళ్లి అర్థరాత్రి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్‌ భానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా మృతున్ని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్‌ గన్‌మెన్‌ ముత్తంగి శ్రీనివాస్‌గా గుర్తించారు. పటాన్‌ చెరు మండలంలోని భానూరు వద్ద అదుపుతప్పిన బైకు హద్దు రాయిని ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు అంటుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్లే చనిపోయాడని మరికొందరంటున్నారు. 


 ఆయన స్వస్థలం శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌. గత కొంతకాలంగా ఎమ్మెల్యే యాదయ్య వద్ద గతకొంత కాలంగా గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం ఎలిమెల గ్రామంలో ఆదివారం బీరప్పల జాతర ఉంది. దీంతో శ్రీనివాస్‌ తన అమ్మమ్మ వాళ్లింటికి వచ్చాడు. రాత్రి జాతర ముగిసిన అనంతరం అర్థరాత్రి శంకర్‌ పల్లి మండలం బుల్కాపూర్‌ కు తిరిగి వస్తున్న సమయంలో కొండకల్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన శ్రీనవాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  కాగా శ్రీనివాస్ మృతితో కుటుంబంలో   దీంతో తీవ్రంగా గాయపడిన గన్‌మెన్‌ శ్రీనివాస్‌ అక్కడికక్కడే మరణించారు.శ్రీనివాస్ మరణంతో బుల్కాపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

అమ్మమ్మ వాళ్లింట్లో అందరితో సరదాగా గడిపిన శ్రీనివాస్ అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాస్ మృతి పట్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో కోల్పొవడం అత్యంత బాధకరమైని ఆయన అన్నారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే యాదయ్య ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పష్టం చేశారు. శ్రీనివాస్ మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. పోలీసులు కేసే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు