/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Road Accident wanaparthy
Telangana: వనపర్తిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెల్టూరు గ్రామం జాతీయ రహదారిపై డీసీఎం సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు డీసీఎం ను ఢీకొట్టింది. దీంతో కారు వెనకాల వస్తున్న మరో భారీ కంటైనర్ కారును ఢీకొట్టింది. డీసీఎం, కంటైనర్ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయిన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరు స్పాట్ డెడ్
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని నందికొట్కూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గురువారం హైదరాబాద్ నుంచి సొంతూరు నందికొట్కూరుకు బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో సిద్దు (45), చిన్నబాబు అఫియాన్ (10) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే