Crime News: ఘోరం.. వంతెనను ఢీకొట్టిన బస్సు.. 8 మంది ప్రయాణికులు మృతి!
పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. బఠిండాకు వస్తున్న బస్సు శుక్రవారం జీవన్ సింగ్వాలా గ్రామం వద్ద వంతెనను ఢీ కొట్టింది. అనంతరం బస్సు పంట కాల్వలో పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కొల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు.