/rtv/media/media_files/2025/03/15/Y9SAn4BT9n2InPjTgzNo.jpg)
hyderabad kukatpally road accident lorry hits scooty one dead on the spot
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా వాహనాన్ని నడిపి.. అదుపు చేయలేక ఎదుటి ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటున్నారు. వీటిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.
ఇది కూడా చూడండి:స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
kukatpally road accident
తాజాగా తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక లారీ బీభత్సం సృష్టించింది. అడ్డుగా ఉన్న స్కూటీని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి:రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
కూకట్ పల్లి - ముంబై రహదారిపై కంటైనర్ లారీ అతి వేగంగా వచ్చింది. మెట్రో పిల్లర్ నెంబర్ A 681 వద్ద స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి కింద పడిపోవడంతో.. ఆ లారీ అతడి తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతి చెందిన వ్యక్తిని ఫణి రంజన్(45)గా పోలీసులు గుర్తించారు. అతడు డిజిటల్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ యాక్సిడెంట్‌తో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది.
ఇది కూడా చూడండి:దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...