/rtv/media/media_files/2025/03/17/CW88e1wCEeLrmh7IrQsx.jpg)
Car Collides With Metro Pillar
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం రోడ్డుపై వేగంగా వెళ్తు అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిచారు. కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులోనే కారు నడిపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
మరోవైపు అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో - క్వారీ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న లారీ సేఫ్టీ గడ్డర్‌ను ఢీకొన్నది. దీంతో రైల్వే వంతెన కుంగింది. వంతెన కుంగడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీన్ని గమనించిన అనకాపల్లి నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు లోకోపైలెట్ రైలును నిలిపివేశాడు. గూడ్స్ రైలు రైల్వే వంతెన మీద నిలిచిపోవడంతో రైల్వే లైన్ బ్లాక్ అయింది.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
ఇక ఏపీ అల్లూరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం లంబసింగి జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఒక బైకుపై వెళ్తున్న ఫ్యామిలీలో భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య, కుమారుడి పరిస్థితి విషమం ఉంది. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
Also Read: యువతకు స్వయం ఉపాధి.. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు ప్రారంభం