ఆర్జీవీ విచారణకు వస్తాడా..? | Director Ram Gopal Varma | Vyuham |RTV
ఆర్జీవీ విచారణకు వస్తాడా..? | Director Ram Gopal Varma | Vyuham |Rumors prevail in Andhra Pradesh on the Disappearance of Ram Gopal Varma | RTV
ఆర్జీవీ విచారణకు వస్తాడా..? | Director Ram Gopal Varma | Vyuham |Rumors prevail in Andhra Pradesh on the Disappearance of Ram Gopal Varma | RTV
చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆర్జీవిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆర్జీవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. నేడు ఈ కేసుపై విచారణకు రావాల్సిన RGV గైర్హాజరయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు.
దర్శకుడు ఆర్జీవికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలన్న పిటీషన్‌పై ఏపీ హై కోర్టు ఇవాళ విచారించింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్ ఇచ్చింది.
ఆర్జీవిపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయింది. ఈ నెల 19న స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవి, బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. డాకు మహారాజ్లో బాలయ్య ఇంత క్లాస్లీ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నాడు.
దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 'వ్యూహం' సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGV పై కేసు నమోదు చేశారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీపావళి సందర్భంగా టపాసులు కాల్చారు. కానీ టపాసులు పేలుతున్నా కూడా వాటి దగ్గరే ఎలాంటి భయం లేకుండా కూర్చొని చేతిలో కప్ తో ఏదో తాగుతున్నట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ గోపాల్ వర్మ.. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఉన్న ఫొటోను తన ఎక్స్‌లో షేర్ చేశాడు. దానికి ' ఆర్జీవీ డెన్ యానిమల్ పార్క్‌లో ఓ యానిమల్ మరో యానిమల్‌ను ఇంకొక యానిమల్కు చూపిస్తుందంటూ' క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పిక్ నెట్టింట వైరలవుతోంది.
కొండా సురేఖ, సమంత వివాదంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అందులో కొండా సురేఖ.. సమంతను అవమానించలేదు, పొగిడారని RGV అన్నారు. అవమానించింది నాగార్జున, నాగ చైతన్యను అని.. ఏ ఇంట్లో ఒక మామ, భర్తపై ఇలాంటి ఆరోపణ జీవితంలో వినలేదని తెలిపారు.