హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్.. తనను అరెస్టు చేసి అలా చేసే ప్రమాదం ఉందంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆర్జీవిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆర్జీవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. By Seetha Ram 20 Nov 2024 in సినిమా ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఇటీవల కేసు నమోదు అయింది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై అసభ్యకర పోస్టులు పెట్టారని.. అలాగే 'వ్యూహం' మూవీ ప్రమోషన్ సమయంలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేత మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు. Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు? ఆయన ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్జీవికి నోటీసులిచ్చారు. తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని ఆర్జీవి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆర్జీవికి ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ హై కోర్టులో రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలన్న పిటీషన్ పై ఏపీ హై కోర్టు రాంగోపాల్ వర్మకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థన చేయగా.. దానికి ఏపీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్టుపై ఏమైనా ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్ ఇచ్చింది. దీంతో ఆర్జీవికి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా ఇది మాత్రమే కాకుండా తర్వాతి కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవికి నోటీసులు ఇచ్చారని.. అయితే హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై కూడా ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని.. కోర్టు ముందు కాదని న్యాయమూర్తి మరో షాక్ ఇచ్చారు. మంగళవారం విచారణకు గైర్హాజరు Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి మంగళవారం జరగనున్న విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆర్జీవికి నోటీసు అందించారు. అయితే మంగళవారం పోలీసుల విచారణకు ఆర్జీవి హాజరుకాలేదు. అదే సమయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్జీవీ తరఫు న్యాయవాది పోలీసుల వద్దకు వెళ్లారు. షూటింగ్ లో బిజీగా ఉన్నందున హాజరుకావడం లేదని.. వారం సమయమివ్వాలని ఆర్జీవి పంపిన లేఖను న్యాయవాది పోలీసులకు అందించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్ మరోవైపు రామ్ గోపాల్ వర్మ్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందని పటిషన్ లో పేర్కొన్నారు. అందువల్ల తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. #nara-lokesh #ap-cm-chandrababu #bail-petition #highcourt #rgv మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి