RGV : ఇదెక్కడి మాస్ రా మావా.. పేలుతున్న టపాసుల మధ్య RGV, వీడియో వైరల్

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దీపావళి సందర్భంగా టపాసులు కాల్చారు. కానీ టపాసులు పేలుతున్నా కూడా వాటి దగ్గరే ఎలాంటి భయం లేకుండా కూర్చొని చేతిలో కప్ తో ఏదో తాగుతున్నట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
rgv

'నా రూటే సెపరేటు'.. ఈ డైలాగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సరిగ్గా సూట్ అవుతుంది. RGV అందరిలా కాదని ఆయన చేసే పనులు, చెప్పే మాటలను బట్టే మనకు అర్థమవుతుంది. ఆయన చేసే కామెంట్స్ సోషల మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంటాయి. అప్పుడప్పుడు షాకింగ్ ఫోటోలు, వీడియోలు కూడా ఆర్జీవీ షేర్ చేస్తుంటారు.

తాజాగా ఈ డైరెక్టర్ కు సంబంధించిన అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాటర్ ఏంటంటే.. నిన్న దీపావళి పండగను ప్రతీ ఒక్కరూ ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. సెలెబ్రిటీలు సైతం టపాసులు కాలుస్తూ తెగ సందడి చేశారు. ఇందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ సైతం దివాళీ సందర్భంగా టపాసులు కాల్చారు.

Also Read :  మోక్షజ్ఞకు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్..?

ఏం చేసినా సంచలనమే..

కానీ టపాసులు పేలుతున్నా కూడా వాటి దగ్గరే ఎలాంటి భయం లేకుండా కూర్చొని చేతిలో కప్ తో ఏదో తాగుతున్నట్లు కనిపించాడు. మాములుగా టపాసులు పేలే సమయంలో ఎవరైనా వాటికి కొంచం దూరం ఉంటారు. కానీ మన RGV మాత్రం అవి ఒకదాని తరువాత ఒకటి పేలుతున్నా కూడా వాటి ముందే కూర్చొని ఎంజాయ్ చేయడం నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ..'RGV ఏం చేసినా అది సంచలనమే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : ఇలియానా బర్త్ డే స్పెషల్.. ఆ చిన్న తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు