BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు! దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 'వ్యూహం' సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGV పై కేసు నమోదు చేశారు. By Seetha Ram 11 Nov 2024 in సినిమా ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. తాజాగా అతడిపై కేసు నమోదు అయింది. Also Read: ఈ వారం బాక్స్ ఆఫీస్ పండగ.. సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే ! ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రాంగోపాల్ వర్మపై కేసు ఫైల్ అయింది. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGV పై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏంటంటే.. ఆర్జీవి తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో చంద్రబాబు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. అప్పట్లో ట్రైలర్ రిలీజ్ చేయడంతో అందరికీ పూర్తిగా అర్థం అయిపోయింది. Also Read: ‘SSMB29’ బిజినెస్ ఊహించడం కష్టమే.. రూ.2,000 కోట్లకు పైగా జరగొచ్చు’ దీంతో ఈ మూవీలో పాత్రలు తమ ఫ్యామిలీని కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కించారని.. వెంటనే ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ టైంలో ఆర్జీవి.. చంద్రబాబు ఫ్యామిలీపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కేసు నమోదు అయింది. Also Read: ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన! Also Read: ఇదెక్కడి బిగ్ బాస్ రా బాబు.. హౌజ్ లో టేస్టీ తేజ, నిఖిల్ రచ్చ రచ్చ! #vyooham-movie #ramuism #cm-chandra-babu #rgv మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి