/rtv/media/media_files/75URAOJzSf29JhrHBd1V.jpg)
Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. కొన్ని సార్లు కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఇక ఆయన ఏదైనా ఫొటో పెడితే నెట్టింట తెగ చర్చ జరగడమే కాదు.. అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కూడా నిలుస్తుంటుంది.
Also Read : విశ్వక్ సేన్ కొత్త సినిమా విడుదల వాయిదా
తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఉన్న ఫొటోను వర్మతన ఎక్స్‌లో షేర్ చేశాడు. దానికి ' ఆర్జీవీ డెన్ (RGV Den) యానిమల్ పార్క్‌లో ఓ యానిమల్ మరో యానిమల్‌ను ఇంకొక యానిమల్‌కు చూపిస్తుందంటూ' తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. ఫొటోలో వర్మ స్క్రీన్‌పై చూపిస్తున్న విజువల్‌ను సందీప్ రెడ్డి వంగా ఆసక్తిగా చూస్తున్నాడు. ఇంతకీ RGV.. యానిమల్ డైరెక్టర్‌కు ఏం చూపిస్తున్నాడన్నది మాత్రం క్లారిటీ లేదు.
An ANIMAL showing an ANIMAL to another ANIMAL in the ANIMAL PARK of RGV DEN pic.twitter.com/9EpPj99mgL
— Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2024
Also Read : యాక్షన్ తో అదరగొట్టిన సమంత.. 'సిటాడెల్' ట్రైలర్ చూశారా?
ఏం ప్లాన్ చేస్తున్నారో?
దీంతో ఈ పిక్ చూసిన నెటిజన్స్ అంతా ఈ ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో? నని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఈ ఇద్దరు క్రేజీ దర్శకులు ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను టి.సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : ప్రతీ సీన్ ఇంటర్వెల్ లా ఉంటుంది.. 'పుష్ప2' పై హైప్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్
ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కథానాయికగా నటించనుందని ప్రచారం సాగుతోంది. డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఒకే వేదికపై సూర్య, ప్రభాస్, రజినీకాంత్.. ఫ్యాన్స్ కు పండగే