RGV: ఆర్జీవీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్? దర్శకుడు ఆర్జీవికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలన్న పిటీషన్‌పై ఏపీ హై కోర్టు ఇవాళ విచారించింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్ ఇచ్చింది. By Seetha Ram 18 Nov 2024 in సినిమా ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదు అయింది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవిపై టీడీపీ నేత, మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు. ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు ఆర్జీవిపై కేసు నమోదు దీంతో ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్జీవికి నోటీసులిచ్చారు. తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని ఆర్జీవి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆర్జీవికి గట్టి షాక్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! తాజాగా ఏపీ హై కోర్టులో రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలన్న పిటీషన్ పై ఏపీ హై కోర్టు రాంగోపాల్ వర్మకు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! ఆర్జీవికి ఏపీ హైకోర్టు ఝలక్ ఈ కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థన చేయగా.. దానికి ఏపీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్టుపై ఏమైనా ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్ ఇచ్చింది. దీంతో ఆర్జీవికి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఇది కూడా చదవండి: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! ఇది మాత్రమే కాకుండా రేపు కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవికి నోటీసులు ఇచ్చారని.. అయితే హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై కూడా ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని.. కోర్టు ముందు కాదని న్యాయమూర్తి మరో షాక్ ఇచ్చారు. #Big Shock to RGV #ap-high-court #rgv మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి