Kota : కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల నేపథ్యంలో షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్, రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందు సింగ్ షెకావత్లను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని డుంగ్రి గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా బాధితులు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని సికార్ జిల్లా ఫతేపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం వంతెనపై ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు ఉన్నారు.
రాజస్థాన్ అగ్దావా ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ వద్ద భద్రతా లోపం బయటపడింది. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా C295 విమానం ల్యాండింగ్ అవగానే అకస్మాత్తుగా ఒక ఎద్దు ఎయిర్ స్ట్రిప్పైకి దూసుకొచ్చి గందరగోళం సృష్టించింది. భద్రతా సిబ్బంది, కమాండోలు భయాందోళనకు గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది.
రాజస్థాన్లో మరోసారి అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ అత్యాచార ఘటన ధోల్పూర్ జిల్లాలోని కౌలారి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలవిసర్జనకు పొలానికి వెళ్లిన ఓ పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఓ మహిళపై అత్యాచారం జరిగింది. దానికే కుంగిపోతుంటే..న్యాయం చేయాల్సిన కోర్టు ఆమెను మరింత అవమానించింది. రాజస్థాన్లో ఓ దళిత మహిళకు ఈ ఘోర అవమానం జరిగింది.
సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.