కోటాలో దారుణం.. మరో విద్యార్థి అనుమానస్పద మృతి..

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జేఈఈకి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
death

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జేఈఈకి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన విద్యార్థి (16) ఏడాది కాలంగా తన తల్లితో పాటు కోటాలోని తల్మండి ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. అక్కడే ఐఐటీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన గదికి వెళ్లాడు. అయితే కొద్దిసేపటి తర్వాత విద్యార్థి వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడి తల్లి ఆస్పత్రికి తరలించింది. ఆ విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.  

Also Read: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు పడి..

ఆత్మహత్యా లేక సహజ మరణమా ?

విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్ దొరకలేదని కోట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్ (DSP) యోగేష్ శర్మ అన్నారు. గత కొన్ని రోజులుగా కూడా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని.. అందరితో కూడా సరదాగా ఉన్నాడని అతని స్నేహితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇది ఆత్మహత్యా లేక సహజ మరణమా అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని తెలిపారు. 

Also Read: బాలుడి కడుపులో 56 వస్తువులు.. షాకైన వైద్యులు.. చివరికీ

ఇదిలాఉండగా.. కోటాలో ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వస్తుంటారు. అయితే గత కొంతకాలంగా కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒత్తిడి వల్లే ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. 2025లో ఇప్పటిదాకా మొత్తం 19 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత ఏడాది దాదాపు 30 మంది విద్యార్థులు సూసైడ్‌కు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజస్థాన్‌ ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు అందుబాటులో కూడా ఉంచినప్పటికీ ఆత్మహత్యలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

Also Read: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం.. ఏం జరిగిందంటే ?

Advertisment
తాజా కథనాలు