Vijayawada:అజ్మేర్‌ లో  విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి!

విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల బస్సు రాజస్థాన్‌ లోని అజ్మేర్‌ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ భార్య జ్యోత్స్న మృతి చెందారు.

New Update
accident

రాజస్థాన్‌ లోని అజ్మేర్‌ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

విజయవాడ నుంచి బార్‌ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్‌ విహార యాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాఉల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్‌ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. న్యాయవాది రాజేంద్ర ప్రసాద్‌ తో పాటు మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: కాంగ్రెస్ పునరుజ్జీవం..హర్యానాలో ఓట్లన్నీ అటేనా?

వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందా..పార్టీ పునర్వైభవం సాధిస్తుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు