గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Raja Singh | RTV
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Goshamahal's BJP MLA Raja Singh as he makes provoking statements in the forum| RTV
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Goshamahal's BJP MLA Raja Singh as he makes provoking statements in the forum| RTV
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎప్పుడూ ఏదో ఒక సంచలన విషయాలను ప్రకటించడం బీజేపీ నేత రాజాసింగ్‌కు అలవాటే. తాజాగా ఇప్పుడు ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు.రోడ్లపై నమాజ్ చేయడాన్ని అనుమతించొద్దని...వారు అలా చేస్తే తాము చాలీసా చదవాల్సి వస్తుందని రాజాసింగ్ పోలీస్ కమిషనర్ని హెచ్చరించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
TS: కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని ఆరోపించారు. HYDలో మేము గెలుస్తున్నామని తెలిసి ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు.
దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలుపెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులు గణపతి మండపాల్లో పూజలను అందుకున్న బుజ్జి గణపయ్య గంగమ్మతల్లి ఒడిలో చేరే సమయం దగ్గర పడింది.
మంత్రి కేటీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు.
హోం మంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి ఓ రబ్బర్ స్టాంప్‌లా మారారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ మర్డర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.