BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వామీజీలను కలుస్తున్నారన్న చర్చ సాగుతోంది.

New Update
Raja singh interesting tweet

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను దర్శించుకుంటున్నారు. ఈ రోజు శంఖేశ్వర్ భవన్‌లో కొలువైన పూజ్య ఆచార్య శ్రీ సూరీశ్వర్జీ మహారాజ్ ను దర్శించుకున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రాష్ట్ర-సంత్ శ్రీ లలితప్రభ జీ, శ్రీ చంద్రప్రభ జీని సైతం దర్శించకుని ఆశీర్వాదం తీసుకున్నారు. వీరి ఆశీర్వాదంతో సమాజం, దేశ సేవ చేయాలనే తన సంకల్పానికి మరింత శక్తి లభిస్తుందన్నారు. ఈ వివరాలను రాజాసింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే.. రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటుండడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలోనూ ఇంత వరకు  చేరలేదు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని.. ఈ నేపథ్యంలోనే స్వామీజీలను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. 

Also Read :  తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు

గోషామహల్ నుంచి హ్యాట్రిక్ విజయాలు..

2014, 18, 23 ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్ నియోజకవర్గం ఎన్నికల బరిలో దిగిన రాజాసింగ్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 2018-23 మధ్య ఆయన ఓ సారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న విమర్శల నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ గోషామహల్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది బీజేపీ. ఆ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. బీజేపీ నుంచి 2023లో తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలందరిలో రాజాసింగ్ మాత్రమే పార్టీలో సీనియర్. అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఆయనే. 

ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్ష నేత పదవి తనకు ఖాయమని రాజాసింగ్ భావించారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం మహేశ్వరరెడ్డికి అవకాశం ఇచ్చింది. అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశించారు. కానీ మాధవిలతను అక్కడి నుంచి పోటీకి దించింది బీజేపీ హైకమాండ్. ఈ రెండు విషయాల్లో తీవ్ర మనస్థాపానికి గురైన రాజాసింగ్.. పార్టీ పెద్దలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

ముఖ్యంగా రాష్ట్రంలో అగ్రనేతలు అని చెప్పుకునే వారే పార్టీ ఎదగకపోవడానికి కారణమని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా రామ్ చందర్ రావును నియమించిన రోజే ఆయన రాజీనామా చేశారు. అయితే.. పార్టీ రాష్ట్ర నేతలపై దుమ్మెత్తి పోస్తున్న రాజాసింగ్.. మోదీ, అమిత్ షాలపై మాత్రం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఆయన మళ్లీ బీజేపీలోకి ఎంట్రి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. 

Also Read :  ఆ నలుగురు కుట్ర చేశారు...రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

telugu breaking news | telugu-news | raja-singh | latest-telugu-news | latest telangana news

Advertisment
తాజా కథనాలు