Mascow-Trump:మాస్కోకు ట్రంప్ ప్రతినిధి!
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి చూడాలని ట్రంప్ ను కోరారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. పుతిన్ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు.