Russia: పదవి నుంచి తొలగింపు..ఆత్మహత్య చేసుకున్న రష్యా మంత్రి

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్‌ స్తారోవోయ్త్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడంతో..రోమన్ మరణం సంచలనంగా మారింది. 

New Update
russia minister

EX Transport Minister Roman Starovoit

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇంకా ఆగలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో లాస్ట్ వీకెండ్ ఉక్రెయిన్ దాడులు చేస్తుందనే అనుమానంతో రష్యాలో వందలాది విమానాలు నిలిచిపోయాయి. అయితే గతవారం రష్యాల్లో సెలవులు ఎక్కువుగా వచ్చాయి. దీంతో చాలా మంది ప్రయాణాలు పెట్టుకున్నారు. కానీ విమానాలు రద్దు అవడంతో ప్రయాణాల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. 

తనను తానే కాల్చుకుని..

ఈ మొత్తం సంఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే యాక్షన్ లోకి దిగిపోయి రవాణా మంత్రి రోమన్ స్తారోవోయ్త్ ను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఆంద్రే నికితిన్‌ను తాత్కాలిక రవాణాశాఖ మంత్రిగా నియమించారు. ఇది జరిగిన వెంటనే రోమన్ కొన్ని గంటల వ్యవధిలోనే శవమై తేలారు. ఆయన తనను తానే కాల్చుకున్నారని, కారులో మృతదేహం లభ్యమైందని రష్యా స్థానిక వార్త సంస్థలు ప్రచురించాయి. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. 

రోమన్‌ స్తారోవోయ్త్‌ ఉక్రెయిన్‌ సరిహద్దులోని కర్స్క్‌ రీజియన్‌లో జన్మించారు. 2024 నుంచి రష్యా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. దానికన్నా ముందు ఐదేళ్లు కర్స్క్‌ రీజియన్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఫెడరల్‌ రోడ్‌ ఏజెన్సీ , పరిశ్రమల విభాగం లో కీలక విధులు నిర్వహించారు.

Also Read: Tesla Shares: ట్రంప్ తో గొడవ..టెస్లా షేర్లు ఢమాల్

Advertisment
Advertisment
తాజా కథనాలు