PB: పంజాబ్ లో 1200 ట్రావెల్ ఏజెన్సీలపై దాడులు..ఏడుగురు అరెస్ట్
పంజాబ్ లో అక్రమ ఏజెంట్లకు అడ్డకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా 1200లకు పైగా ఏజెన్సీలపై సోదాలను నిర్వహించారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు.
పంజాబ్ లో అక్రమ ఏజెంట్లకు అడ్డకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా 1200లకు పైగా ఏజెన్సీలపై సోదాలను నిర్వహించారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు.
కుంభమేళా త్రివేణి సంగమంలో వదంతులు ప్రచారం చేసి భక్తులను తప్పుదోవ పట్టించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 140 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేశారు. డిఐజి వైభవ్ కృష్ణ 13 FRI లు ఫైల్ చేశామన్నారు.
గంజాయి రవాణాపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఒడిస్సా నుంచి అధికంగా గంజాయి రవాణా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇంటర్ స్టేట్ గ్యాంగ్‌లపై నిఘా పెట్టారు. పంటసాగును అరికట్టేందుకు ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ తెలిపారు.
మావోయిస్టులకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఛత్తీష్ గఢ్‌లో భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. సుక్మా అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్న 203 కోబ్రా, 131 CRPF జవాన్లు.. మావోయిస్టుల ఆయుధాలతో పాటు పార్టీ కీలక సమాచారం కలిగిన 15 డైరీలు దొరికినట్లు తెలిపారు.
ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కట్టడి చేసిన డ్రగ్స్ అమ్మకాలు మాత్రం అరికట్టలేకపోతుంది. డ్రగ్స్ విక్రయదారులు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చ విదేశీయులు డ్రగ్స్ అమ్మకాల్లో ముందుంటున్నారు.
ఇల్లరికం రానందుకే అత్తింటివారు పెట్రోల్ పోసి నిప్పంటించారని ఇచ్చిన గౌతమ్ మరణవాంగ్మూలం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాగా గౌతమ్ డెత్ కేసు మిస్టరీగా మారింది. అంతకుముందు భార్య కావ్యతో గౌతమ్ చేసిన వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారనున్నది.
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినిపై చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకుహైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగాల మోసం బయటపడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నకిలీ ఐటీ కంపెనీ దారుణంగా మోసం చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతీయువకుల నుంచి లక్షలు కాజేసి బోర్డు తిప్పేసింది. నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇల్లరికం రానన్నాడని అల్లుడిపై అత్తమామలు బామ్మర్థులు పెట్రోల్ పోసి తగలబెట్టడంతో అల్లుడు గౌతమ్ మృతిచెందాడు. తనపై అత్తామామలు, భార్య కుటుంబసభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటినట్లు గౌతమ్ మరణవాంగ్మూలం ఇచ్చాడు.