Maoist: మవోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద సైనికచర్యగా భావిస్తుండగా 72 గంటలుగా భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే కర్రెగుట్టలను సేఫ్ జోన్ గా మలుచుకున్న మావోలకోసం కేంద్రపారామిలిటరీ బలగాలు ప్రణాళికలో భాగంగా మొదట కర్రె గుట్టలపైకి డ్రోన్లు ఎగరేవేశాయి. శాటిలైట్ డ్రోన్ కెమెరా విజువల్స్ చూసిన భధ్రతాబలగాలు షాక్ అయినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలపై దాదాపు 3వేల మంది మావోయిస్టులు మకాం వేసినట్లు భధ్రతాబలగాల అంచనా వేస్తున్నాయి. కర్రెగుట్టల చుట్ఠూ బూబీట్రాప్స్, ప్రెషర్ కుక్కర్ బాంబులు, ఐఈడీలు అమర్చినట్లు గుర్తించి కొన్నింటిని ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.
బంకర్ లో తలదాచుకున్న హిడ్మా..
ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కర్రెగుట్టల్లోని ఓ బంకర్ లో తలదాచుకున్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు చెబుతున్నారు. హిడ్మా టార్గెట్ గా రంగంలోకి దిగిన కేంద్రపారామిలిటరీ, ఛత్తీస్ ఘఢ్, తెలంగాణ భద్రతాబలగాలు కర్రెగుట్టలను చేధించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం దాదాపు 4వేల బలగాలతో ఇంచ్ బై ఇంచ్ ముందుకు వెళుతున్నామని, అధునాతన ఆయుధ సంపత్తిని కర్రె గుట్టలకు చేర్చుకుంటున్నాయని అధికారులు తెలిపారు. వారం రోజలపాటు ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు భధ్రతాబలగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిత్యవసర సరుకులు నిలిపివేత..
ఇక కర్రెగుట్టల చుట్టూ బూబీట్రాప్స్ అమర్చి రోప్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని, సాధ్యమైనంత వరకు భద్రతాబలగాలు ముందుకు కదులుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిత్యవసర సరుకులు వెంకటాపురం నుంచి తీసెకెళ్లినట్లు సమాచారం అందడంతో కర్రెగుట్టలపైకి ఆహారం, మందులు, నిత్యావసర సరుకులు నిలిపివేశారు. ఆహారం లేక మావోయిస్టు యాక్షన్ టీంలు నీరసించి బయటకు వచ్చిన సమయంలో ప్రతిదాడి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర సరిహద్దుల పరిధిలో సుమారు 280 చదరపు కి.మీ మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ కర్రెగుట్టల చుట్టూ మహారాష్ట్రకు చెందిన సీ-60 కమండోస్, తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ యూనిట్స్, ఛత్తీస్ ఘఢ్ కు చెందిన బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరెషన్ లీడ్ చేస్తున్న సెంట్రల్ మిలిటరీ ఫోర్స్ పహారా కాస్తున్నాయి.
police | abc-oparation | telugu-news | karregutta