/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
Telangana police jobs Notification updates
TG JOBS: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పోలీసు శాఖలో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో పలు ఖాళీలను భర్తీ చేయనుంది.
Also Read : గులాబీ బాస్ సభలో బన్నీ పోస్టర్..!
పదవి విరణమ భర్తీలు కూడా..
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో 12 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనుండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణలు జరగగా.. వీటిని కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరో 30 వేల ఉద్యోగాలు..
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో చేపట్టిన పర్యటన ఈ రోజుతో ముగిసింది. సీఎం రేవంత్ టీమ్ రేపు హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఒప్పందాలు జరిగాయి. దీంతో దాదాపు 30,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. రూ.1,000 కోట్లు ప్రారంభ పెట్టుబడి కాగా రూ.5,000 కోట్ల పెట్టుబడుల అంచనా అని అధికారులు తెలిపారు. తద్వారా 30,000 ఉద్యోగాలు లభించనున్నట్లు చెప్పారు.
Also Read : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీలపై TDP జెండా!
police | telangana | telugu-news | today telugu news
Follow Us