Pahalgam Attack: పహల్గాం దాడి ఎఫెక్ట్...ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత!
పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఉగ్రవాదులు,అనుమానితుల ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను దళాలు పేల్చేశాయి.
పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఉగ్రవాదులు,అనుమానితుల ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను దళాలు పేల్చేశాయి.
పహల్గాం దాటి ఘటన పై పాక్ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది.పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోందన్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లే ఆయాజ్ ఆహ్మద్ అనే వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. టూరిస్టుల రాక గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.