యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?
ప్రేమ వ్యవహారం ఓ యువకుని బలి తీసుకుంది. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్ ముందే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పోలీసులే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.
ప్రేమ వ్యవహారం ఓ యువకుని బలి తీసుకుంది. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్ ముందే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పోలీసులే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.
భారత ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలోనూ మోడీకి వీరాభిమానులున్నారు. జాబ్రా అనే వ్యక్తి ప్రధానిమోడీ చిత్రాలతో ఉన్న జాకెట్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు 2014లో తన కారు నెంబర్ ప్లేట్ పై పీఎం మోడీ అని రాయించుకున్నాడు. మోడీ అమెరికాకు చేరుకోగానే న్యూయార్క్ కు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అందులో మినేష్ సి పటేల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మోడీ అభిమాని అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా..!!
వర్షాలు ఆలస్యమైనప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కేసీఆర్ ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రాజెక్టు పరిధిలో సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం. శబరిమల ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిప్పారు. ఎరుమేలిలోఈ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం నిర్మితం కానున్న ఎయిర్ పోర్టుకు రంగం సిద్ధమైంది.
మహాకుంభమేళాకు సమయం ఆసన్నమైంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో 2025లో కుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం భారతీయ రైల్వే ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకుగాను ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఫిట్నెస్ పై శ్రద్ధ చూపించే అందాల తారలు, యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. యోగా తమ ఫిట్నెస్ తోపాటు మానసిక ప్రశాంతతను ఇచ్చిదంటూ తమ ఫ్యాన్స్ కు చెప్పేందుకు సామాజిక మీడియాలో వ్యాయామం చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తుంటారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ..యోగాను అలవరచుకని అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీస్ ఎవరో ఓసారి చద్దాం.
యోగ శరీరాన్ని పరిపూర్ణత వైపు ప్రయాణంలో ఆత్మకు వాహనంగా పరిగణిస్తుంది, యోగ శారీరక వ్యాయామాలు శరీరాన్ని మాత్రమే కాకుండా అభివృద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి. వారు మానసిక సామర్థ్యాలను మరియు ఆధ్యాత్మిక సామర్థ్యాలను కూడా విస్తృతం చేస్తారు.
అమెరికాలో దారుణ ఘటన జరిగింది. హోండురాస్ లోని మహిళ జైలులో రెండు ముఠాల మధ్య హింస చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. హోండురాస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30మైళ్ల దూరంలో ఉన్న తమరాలోని జైలులో ఈ ఘటన జరిగినట్లు హోండురాస్ జాతీయ పోలీసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తెలిపింది.