కరీనాకపూర్ నుంచి శిల్పాశెట్టివరకు...యోగాతో ఉత్సాహాన్ని నింపుతున్న బాలీవుడ్ బ్యూటీస్..!! ఫిట్నెస్ పై శ్రద్ధ చూపించే అందాల తారలు, యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. యోగా తమ ఫిట్నెస్ తోపాటు మానసిక ప్రశాంతతను ఇచ్చిదంటూ తమ ఫ్యాన్స్ కు చెప్పేందుకు సామాజిక మీడియాలో వ్యాయామం చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తుంటారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ..యోగాను అలవరచుకని అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీస్ ఎవరో ఓసారి చద్దాం. By Bhoomi 21 Jun 2023 in సినిమా లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఆనాదికాలం నుంచి వస్తున్న ఆరోగ్య సూత్రం యోగా. యోగా ప్రతిఒక్కరి దినచర్యలో భాగమై..అటు శారీక వ్యాధులనే కాదు మనుషులను కూడా మానసికంగా నయం చేస్తుంది. యోగా చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అందుకే ధ్యానం చేస్తూ మనస్సులోని బాధలన్నిటినీ తెలికగా చేసుకునేందుకు ఈ యోగా చాలా సహాయపడుతుంది. శరీరాన్ని అందంగా మార్చుకునేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. కొంతమంది శరీర ప్రయోజనాల కోసం చేస్తుంటే..మరికొంతమంది మానసిక ప్రశాంతత కోసం యోగాను దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ ఈ యోగాను అనుసరిస్తూ ఐదు పదుల వయస్సులోనూ ఎంతో ఫిట్ గా ఉంటుంన్నారు. వారు ఈ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకుని యోగా ప్రాముఖ్యత గురించి తమ అభిమానులకు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, తమ ఫిట్‌నెస్ కోసం యోగాను ఇష్టపడే మన అభిమాన బాలీవుడ్ నటీమణులను చూద్దాం. అనుష్క శర్మ నుండి కరీనా కపూర్ ఖాన్, శిల్పాశెట్టి వరకు, ఈ బాలీవుడ్ బ్యూటీస్ యోగాను తమ వ్యాయామ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. కరీనా కపూర్: కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగా, ఎంతో ఫిట్‌గా ఉంది. జీరో సైజ్ నటిగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది బెబో. శిల్పా శెట్టి : ఈ పొడుగుకాళ్ల సుందరి చాలా కష్టమైన యోగాసనాలను కూడా సులభంగా చేస్తారు. శిల్పాశెట్టి ఫిట్‌నెస్, యోగా చేస్తూ చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్ అయ్యారు. ఎప్పటికప్పుడు, శిల్పా ఇన్‌స్టాగ్రామ్‌లో 'స్వస్త్ రహో మస్త్ రహో' యోగా వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. శిల్పా యోగా చేయడంలో చాలా ప్రావీణ్యం సంపాదించింది. మలైకా అరోరా: మలైకా అరోరా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడదు. చూడటానికి పాతికెళ్ల అమ్మాయిలానే కనిపిస్తుంది. ఆమె ఫిట్ నెస్ ఆరోగ్యకరమైన డైట్ చార్ట్ మాత్రమే కాదు యోగా కూడా. తాను యోగా చేస్తున్న వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంది. మలైకా యోగా సెషన్లకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అనుష్క శర్మ: అనుష్క శర్మ కూడా ఫిట్‌గా ఉండేందుకు యోగా చేస్తుంటారు. గత సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆమె తన యోగా ప్రయాణాన్ని ప్రారంభించింది. యోగా చేస్తున్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలియా భట్: అలియా భట్ కూడా యోగా ప్రారంభించింది. కొన్ని నెలల క్రితం, అలియా భట్ మొదటిసారిగా 108 సూర్య నమస్కార్లు చేసిన తర్వాత 'ఎనర్జిటిక్'గా అనిపించిందంటూ ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి