డోర్సీ ఆరోపణలపై స్పందించిన మస్క్...ఏమన్నారంటే..?

స్థానిక ప్రభుత్వ చట్టాలకు లోబడి ట్విట్టర్ పనిచేయాల్సి ఉంటుందని ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ అన్నారు. అది తప్ప మరో మార్గం లేదన్నారు. చట్టం పరిధిలో భావ ప్రకటనా స్వేచ్చను కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు మాజీ సీఈవో డోర్స్ ఈ మధ్య భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై మస్క్ స్పందించారు.

New Update
డోర్సీ ఆరోపణలపై స్పందించిన మస్క్...ఏమన్నారంటే..?

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO జాక్ డోర్సి ఇటీవల భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రభుత్వాలపై సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందంటూ ఆరోపించారు. దీనిపై కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ బహిరంగంగా స్పందించారు. భారత ప్రధాని మోడీతో మస్క్ భేటీ అయిన అనంతరం భారతీయ మీడియాతో మస్క్ మాట్లాడారు. స్థానిక ప్రభుత్వాలకు కట్టుబడి ఉండటం తప్ప ట్విట్టర్‌కు మరో మార్గం లేదని మస్క్ తెలిపారు.

MODI MUSK

CEOజాక్ డోర్సీ ఈ మధ్య భారత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై మీడియా మస్క్ ను ప్రశ్నించింది. ఏ దేశంలోనైనా అక్కడి చట్టాలను పాటించడమే ఉత్తమమం అన్నారు. అమెరికా నిబంధనలను ప్రపంచం మొత్తానికి ఎలా వర్తింపజేస్తాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో విధంగా నియమాలు, నిబంధనలు ఉంటాయి. స్థానిక ప్రభుత్వ చట్టాలను పాటించకపోతే మమ్మల్ని బయటకు నెట్టేస్తారు. దీనికి పరిష్కారం ఏంటంటే ఏ దేశంలో అయినా ఆ చట్టానికి లోపబడి మనం పనిచేయాల్సి ఉంటుంది. దేశ చట్టాలను విస్మరిస్తూ మనం పనిచేయడం అసాధ్యం. భావ ప్రకటనా స్వేచ్చను కల్పించేందుకు మా వంతు క్రుషిచేస్తామని తెలిపారు ఎలన్ మస్క్.

Advertisment
Advertisment
తాజా కథనాలు