9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

యోగ శరీరాన్ని పరిపూర్ణత వైపు ప్రయాణంలో ఆత్మకు వాహనంగా పరిగణిస్తుంది, యోగ శారీరక వ్యాయామాలు శరీరాన్ని మాత్రమే కాకుండా అభివృద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి. వారు మానసిక సామర్థ్యాలను మరియు ఆధ్యాత్మిక సామర్థ్యాలను కూడా విస్తృతం చేస్తారు.

New Update
9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

 To be healthy, you have to do yoga for an hour

యోగా దినోత్సవం

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తము రెడ్డి, జెడ్పి ఛైర్ పర్సన్ రోజాశర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..యోగాతో మన జీవన శైలి మార్చుకోవాలన్నారు. అప్పుడు రోగాల బారిన పడకుండా ఉంటామని ఆయన అన్నారు.

ఆరోగ్యం కోసం గంట యోగా

ఇక ఒక్కసారి బీపీ, షుగర్ వచ్చిందంటే జీవితం మొత్తం బాదపడాల్సిందేనన్నారు. మన కోసం మనము రోజూ ఒక్కగంట యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. చిన్న వయసులోనే ప్రజలు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీల్లో యోగా చేయాలని చెప్పామన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం కాదన్నారు హరీష్‌రావు.

ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే..అప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధించినట్టు అవుతుందన్నారు. గ్రీన్ కవర్ పెంపకంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. యోగా, ప్రాణాయామం చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చన్నారు మంత్రి హరీష్‌రావు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి రోజూ ఓ గంట పాటు యోగా చేయాలని ఆయన ఆర్థికమంత్రి పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా

యోగ.. ఒక జ్ఞానం, ఒక మార్గం, ఒక చైతన్యం, ఒక ఆధ్యాత్మికం, ఒక వైద్యం. అంతేకాదు యోగ ఒక శాస్త్రబద్ధమైన జీవన విధానం. అలాంటి యోగ భారతీయ షడ్దర్శనాల్లో ఒకటి. దేశంలో క్రీ.పూ. 200 సంవత్సరాల కింద రచించిన యోగ నేడు విశ్వజనీనమై ప్రపంచంలోని సుమారు 180 దేశాలకు వ్యాప్తి చెందింది. వేదకాలం పూర్వమే వెలుగు చూసిన ఈ ప్రాచీన ప్రక్రియకు నేడు ప్రపంచ దేశాలు ప్రణమిల్లుతున్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. భారతీయ సంస్కృతిలో, ఆధ్యాత్మిక చింతనలో యోగాకు ప్రత్యేక స్థానముంది. హిందూ మతంలోనే కాదు, బౌద్ధం, జైనిజంలోనూ దాని మూలాలు కనిపిస్తాయి. యోగ ఎంత ప్రాచీనమైనదంటే.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకు పూర్వమే పురుడుపోసుకుని, వికాసం పొందింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు