మహిళా జైలులో హింసాకాండ... 41 మంది ఖైదీలు సజీవదహనం..!!

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. హోండురాస్ లోని మహిళ జైలులో రెండు ముఠాల మధ్య హింస చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. హోండురాస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30మైళ్ల దూరంలో ఉన్న తమరాలోని జైలులో ఈ ఘటన జరిగినట్లు హోండురాస్ జాతీయ పోలీసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తెలిపింది.

New Update
మహిళా జైలులో హింసాకాండ... 41 మంది ఖైదీలు సజీవదహనం..!!

హోండురాస్‌ జైలులో హింసాత్మక ఘటన కలకలం రేపింది. మంగళవారం మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది ఖైదీలు సజీవదహనమైనట్లు వార్తలు వస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు గ్రూపులు దాడులకు పాల్పడుతూ జైలుకు నిప్పటించారు. ఈ హింసాకాండలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. హోండురాస్ జాతీయ పోలీసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రతినిధి యూరి మోరా మాట్లాడుతూ, చాలా మంది ఖైదీలు సజీవదహనమైనట్లు తెలిపారు. హోండురాస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30 మైళ్ల దూరంలో ఉన్న తమరాలోని జైలులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

honduras prisoners

మీడియా నివేదికల ప్రకారం, ఏడుగురు మహిళా ఖైదీలు కత్తిపోట్లకు గురయ్యారని..వారు ప్రస్తుతం తెగుసిగల్పాలోని ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నట్లు పేర్కొన్నాయి. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల వల్ల అల్లర్లు చెలరేగాయని ఆ దేశ జైలు వ్యవస్థ అధిపతి జూలిసా విల్లానువా తెలిపారు. దీంతో మంగళవారం జైలులో హింస చెలరేగినట్లు చెప్పారు. జైళ్లలో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలు తమ నియంత్రణను విస్తృతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. US మీడియా ప్రకారం, హోండురాస్ జాతీయ మహిళా జైలులో దాదాపు 800 మంది ఖైదీలు ఉన్నారు. జైలు సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువ మంది ఖైదీలు ఇందులో ఉన్నారు. 2020లోనూ హోండురాస్ జైలులో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు